Sunday, October 28, 2012

వెలుగుల గులాబీ


వెలుగుల గులాబీ...
వెలుగు రేఖలతో వికసించిన గులాబి
ఉషోదయంలో ప్రతిక్షణం నీ పూజకై వేచింది..
చీకటి రెప్పలు తెరిచి
వేకువ దుప్పటి తీసి
ముస్తాబయ్యింది,,
నీ సిగలో ఒదగాలని..

ముళ్ళకి తన మదిలో
మెదిలే సొదలన్ని మొరపెట్టింది
మెత్తని రేకులకు సుతిమెత్తని నీ గ్నాపకాన్ని
 గురుతు చేసింది.
తొడిమకు నీ చేయితో తడిమన స్పర్శను
పుప్పొడికి నీవు నాతొ పంచుకున్న
అనుబంధాన్ని మనసిప్పి చెప్పింది..
అందుకేనేమో....


వెలుగు రేఖలతో వికసించిన గులాబి
ఉషోదయంలో ప్రతిక్షణం నీ పూజకై వేచింది..
చీకటి రెప్పలు తెరిచి
వేకువ దుప్పటి తీసి
ముస్తాబయ్యింది,, నీ సిగలో ఒదగాలని..
 —

నీ లీలలు వేవేల కొనియాడనా..

నీ లీల వేవేల కొనియాడనా...
రాగమన్నదొక భామ..
తాళమన్నదొక భామ..
వేణువైనదొక భామ..
ఊయలైనదొక భామ,..
హారమైనదొక భామ...

విరహిణిగాఒక భామ...
భామలందరి భావన ఆరాధనే
ప్రేమమయమైన భావన ఆ"
రాధయే

చిలుకా,, రాచిలుకా


  చిలుకా,, రాచిలుకా

రాచిలుకనై నేనొచ్చా
రాయబారమే నే తెచ్చా..
ప్రవరాఖ్యుని పట్టానె నిలిచా

వరూథినికై చూస్తూ
వనములన్నీ కలయతిరిగా
చిగురుటాకుల మేలిముసుగున ఉన్న
వసంతుని అడిగా,,,
ఏకొమ్మ నీడన ఆముద్దుగుమ్మ జాడని

దేహం దేవాలయమై
హ్రుదయం హిమాలయమై..
పరితపించు మనసు పరిగెట్టే సెలయేరై
నిండు జాబిల్లి, పండు వెన్నెల విరహంతో వేదిస్తే

నిముషమైన నిలువలేక
నిను వీడి బ్రతుకలేక
నీ జాడను సోథిస్తో
సంధించిన అస్త్రాన్ని,,

చిలుకనూ ,, నే రాచిలుకనూ

Saturday, October 27, 2012

కన్నెమనసు.


కన్నెమనసు..

...........
కాముడితో కబురెట్టనా..
మెఘునితో మొరపెట్టనా..
వయసు చెసే అల్లరంతా..
ఓపలేని మేనంతా ..
ఏదో తెలుయని పులకింత..
సాయం చెయరావా ప్రియా
ఈ సాయంకాలం వేళ కూసంత,,,

వేసంగి మల్లెలు వేచి ఉన్నాయి
చెలికాని రాకకు స్వాగతిద్దమని
చిలుక రాయబారమైన పంపేనా
చిగుళ్ళు తొడిగిన నా ప్రేమను
నీకు వివరించుటకు.

ముంగురుల సవరించే
చిరుగాలితొ  చెప్పనా,,
వెన్నెల రాతిరి,
ఈ కన్నియ మనసును ఏలెదొరనీవేనని...

చెప్పాలని ఉంది

చెప్పాలని ఉందిబాల్యంలో నీతో ఆడిన ఆటలు
చెలిమితో నీతో చేసిన బాసలు
మరువదు నా హృదయం..
ఎప్పటికైనా వస్తావని
వేధించె మనసుకు ఊరట కలిగిస్తావని
వేయి కళ్ళతో నా ఎదురు చూపు...

ఏటి ఒడ్డున నీకై వేచి ఉన్నా..
మనసులో మథురిమలెన్నో దాచిఉన్నా..
తుళ్ళిపడే చేపలకు నీ రాకను తెలపాలని
పొగరుతో ఉన్న ఆ కలువకు నీ సొగసు చూపాలని..

పొలం గట్లమీద పరిగెట్టాలని.
గడ్డిపూలతో నీకు దండ కట్టాలని
దాచి తెచ్చిన తాయిలం నీ నోటపెట్టాలని
అనుకున్న ఆనాటి బంధమే అనుబంధమై
ఈనాడు నీముందు నిలిచిందని... 

Friday, October 19, 2012

సరదాల దసరా.


సరదాల దసరా.

సరదాల పండుగ
మన దసరా పండుగ..
కానీ ఏ పరదాలమాటున దాగెనో
ఆ సరదాలు..

అలనాటి పద్యాలు
అర్ధాలు మార్చాయి
అన్నివర్గాల జనులు
మన సంస్కృతిన మరచిన ఘనులు

అయ్యవారికి చాలు ఐదు వరహాలు..
పిల్ల వాళ్ళకు చాలు పప్పుబెల్లాలు
ఆనాటి మాట..

సీటుకొక రేటు సామాన్యుడిపై వేటు
పిల్లలకైతే బుక్స్ తో ఫైటు..
ఈనాటి మాట

పల్లెసీమలు , పట్టు కొమ్మలు
పట్టు పావడాల ముద్దుగుమ్మలు
ముద్దులొలికె పసి పాపలు..
పసిడి కాంతుల పచ్చపైరులు
ఆనాటి పల్లె సీమలు..

వర్గవైషమ్యాలు, కులాల కుశ్చితాలు
భూమి తగాదాలు రచ్చబండ రాజకీయాలు
నేటి పల్లెసీమలు

వీధి భాగవతాలు, బుర్రకథలు
తోలుబొమ్మలాటలు ఎంకి పాటలు
అనాటి సరదాలు.

పబ్బులు క్లబ్బులు
కుర్రకారుకు జబ్బులు
మితిమీరిన నాగరికత
పాశ్చాత్య ఫ్యాషన్ షోలు
నేటి సరదాలు...

యువతకు భవితనిచ్చిన నాడు,,
సమత మమతతో సహజీవనం చేసిననాడు
మతమౌఢ్యం నశించిన నాడు
మానవత్వం మనగలిగిన నాడు..
ఆనాడే సరదా,, ఆనాడే నిజమైన దసరా..
....వెన్నెల వెలుగులు,

http://www.facebook.com/photo.php?fbid=435435479824910&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Thursday, October 18, 2012

జీవన పథములు
ప్రియా నీ పదముల క్రింద
మెత్తని పచ్చికనౌవ్వాలని ఉంది
నీ పెదవులపై తీయని మాటలతో
మచ్చిక చేయాలని ఉంది

మృదుమధుర గీతమై
నీ హృదయ తంత్రులను మీటాలని ఉంది
రవివర్మ చిత్రమై నీ కన్నుల రంగులద్దాలని ఉంది
ప్రకృతి సోయగాన్నై వన్నె చిన్నెలతో
నీకు స్వాగతం చెప్పాలని ఉంది

భువి నుండి దివికి " వెన్నెల వెలుగువై" రావా..
దివికి దిగి ప్రియలాస్యంతో నా హృదయాన్ని రంజింపవా


http://www.facebook.com/photo.php?fbid=431776550190803&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Tuesday, October 16, 2012

సుందరం.... సుమధురం

Add caption
సుందరం.... సుమధురం

స్థాణువులా ఉన్న నేను ..
నిన్ను చూసి వేణులా పాడాను,,
నన్ను నేను మరచి పసిపాపలా ఆడాను

లోకం సుందరమని విన్నాను..
అందంగా మకరందంలా ఉంటుందని
నిన్ను చూసి తెలుసుకున్నాను,,,

జాబిలికి జాజులు పూచినట్లు
వెన్నెలలో మది విరహంతో వేచినట్లు
జలతారు మాటున దాగినా
నీ మోము వికసించిన కలువలా ఉంది

నీ కంటి చూపు భాణం
గురితప్పక్క సూటిగా నాఎదనే చేరింది
ప్రియా నువ్వెక్కడున్నా ఇదే నీకు నా సందేశం.

Sunday, October 28, 2012

వెలుగుల గులాబీ


వెలుగుల గులాబీ...
వెలుగు రేఖలతో వికసించిన గులాబి
ఉషోదయంలో ప్రతిక్షణం నీ పూజకై వేచింది..
చీకటి రెప్పలు తెరిచి
వేకువ దుప్పటి తీసి
ముస్తాబయ్యింది,,
నీ సిగలో ఒదగాలని..

ముళ్ళకి తన మదిలో
మెదిలే సొదలన్ని మొరపెట్టింది
మెత్తని రేకులకు సుతిమెత్తని నీ గ్నాపకాన్ని
 గురుతు చేసింది.
తొడిమకు నీ చేయితో తడిమన స్పర్శను
పుప్పొడికి నీవు నాతొ పంచుకున్న
అనుబంధాన్ని మనసిప్పి చెప్పింది..
అందుకేనేమో....


వెలుగు రేఖలతో వికసించిన గులాబి
ఉషోదయంలో ప్రతిక్షణం నీ పూజకై వేచింది..
చీకటి రెప్పలు తెరిచి
వేకువ దుప్పటి తీసి
ముస్తాబయ్యింది,, నీ సిగలో ఒదగాలని..
 —

నీ లీలలు వేవేల కొనియాడనా..

నీ లీల వేవేల కొనియాడనా...
రాగమన్నదొక భామ..
తాళమన్నదొక భామ..
వేణువైనదొక భామ..
ఊయలైనదొక భామ,..
హారమైనదొక భామ...

విరహిణిగాఒక భామ...
భామలందరి భావన ఆరాధనే
ప్రేమమయమైన భావన ఆ"
రాధయే

చిలుకా,, రాచిలుకా


  చిలుకా,, రాచిలుకా

రాచిలుకనై నేనొచ్చా
రాయబారమే నే తెచ్చా..
ప్రవరాఖ్యుని పట్టానె నిలిచా

వరూథినికై చూస్తూ
వనములన్నీ కలయతిరిగా
చిగురుటాకుల మేలిముసుగున ఉన్న
వసంతుని అడిగా,,,
ఏకొమ్మ నీడన ఆముద్దుగుమ్మ జాడని

దేహం దేవాలయమై
హ్రుదయం హిమాలయమై..
పరితపించు మనసు పరిగెట్టే సెలయేరై
నిండు జాబిల్లి, పండు వెన్నెల విరహంతో వేదిస్తే

నిముషమైన నిలువలేక
నిను వీడి బ్రతుకలేక
నీ జాడను సోథిస్తో
సంధించిన అస్త్రాన్ని,,

చిలుకనూ ,, నే రాచిలుకనూ

Saturday, October 27, 2012

కన్నెమనసు.


కన్నెమనసు..

...........
కాముడితో కబురెట్టనా..
మెఘునితో మొరపెట్టనా..
వయసు చెసే అల్లరంతా..
ఓపలేని మేనంతా ..
ఏదో తెలుయని పులకింత..
సాయం చెయరావా ప్రియా
ఈ సాయంకాలం వేళ కూసంత,,,

వేసంగి మల్లెలు వేచి ఉన్నాయి
చెలికాని రాకకు స్వాగతిద్దమని
చిలుక రాయబారమైన పంపేనా
చిగుళ్ళు తొడిగిన నా ప్రేమను
నీకు వివరించుటకు.

ముంగురుల సవరించే
చిరుగాలితొ  చెప్పనా,,
వెన్నెల రాతిరి,
ఈ కన్నియ మనసును ఏలెదొరనీవేనని...

చెప్పాలని ఉంది

చెప్పాలని ఉందిబాల్యంలో నీతో ఆడిన ఆటలు
చెలిమితో నీతో చేసిన బాసలు
మరువదు నా హృదయం..
ఎప్పటికైనా వస్తావని
వేధించె మనసుకు ఊరట కలిగిస్తావని
వేయి కళ్ళతో నా ఎదురు చూపు...

ఏటి ఒడ్డున నీకై వేచి ఉన్నా..
మనసులో మథురిమలెన్నో దాచిఉన్నా..
తుళ్ళిపడే చేపలకు నీ రాకను తెలపాలని
పొగరుతో ఉన్న ఆ కలువకు నీ సొగసు చూపాలని..

పొలం గట్లమీద పరిగెట్టాలని.
గడ్డిపూలతో నీకు దండ కట్టాలని
దాచి తెచ్చిన తాయిలం నీ నోటపెట్టాలని
అనుకున్న ఆనాటి బంధమే అనుబంధమై
ఈనాడు నీముందు నిలిచిందని... 

Friday, October 19, 2012

సరదాల దసరా.


సరదాల దసరా.

సరదాల పండుగ
మన దసరా పండుగ..
కానీ ఏ పరదాలమాటున దాగెనో
ఆ సరదాలు..

అలనాటి పద్యాలు
అర్ధాలు మార్చాయి
అన్నివర్గాల జనులు
మన సంస్కృతిన మరచిన ఘనులు

అయ్యవారికి చాలు ఐదు వరహాలు..
పిల్ల వాళ్ళకు చాలు పప్పుబెల్లాలు
ఆనాటి మాట..

సీటుకొక రేటు సామాన్యుడిపై వేటు
పిల్లలకైతే బుక్స్ తో ఫైటు..
ఈనాటి మాట

పల్లెసీమలు , పట్టు కొమ్మలు
పట్టు పావడాల ముద్దుగుమ్మలు
ముద్దులొలికె పసి పాపలు..
పసిడి కాంతుల పచ్చపైరులు
ఆనాటి పల్లె సీమలు..

వర్గవైషమ్యాలు, కులాల కుశ్చితాలు
భూమి తగాదాలు రచ్చబండ రాజకీయాలు
నేటి పల్లెసీమలు

వీధి భాగవతాలు, బుర్రకథలు
తోలుబొమ్మలాటలు ఎంకి పాటలు
అనాటి సరదాలు.

పబ్బులు క్లబ్బులు
కుర్రకారుకు జబ్బులు
మితిమీరిన నాగరికత
పాశ్చాత్య ఫ్యాషన్ షోలు
నేటి సరదాలు...

యువతకు భవితనిచ్చిన నాడు,,
సమత మమతతో సహజీవనం చేసిననాడు
మతమౌఢ్యం నశించిన నాడు
మానవత్వం మనగలిగిన నాడు..
ఆనాడే సరదా,, ఆనాడే నిజమైన దసరా..
....వెన్నెల వెలుగులు,

http://www.facebook.com/photo.php?fbid=435435479824910&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Thursday, October 18, 2012

జీవన పథములు
ప్రియా నీ పదముల క్రింద
మెత్తని పచ్చికనౌవ్వాలని ఉంది
నీ పెదవులపై తీయని మాటలతో
మచ్చిక చేయాలని ఉంది

మృదుమధుర గీతమై
నీ హృదయ తంత్రులను మీటాలని ఉంది
రవివర్మ చిత్రమై నీ కన్నుల రంగులద్దాలని ఉంది
ప్రకృతి సోయగాన్నై వన్నె చిన్నెలతో
నీకు స్వాగతం చెప్పాలని ఉంది

భువి నుండి దివికి " వెన్నెల వెలుగువై" రావా..
దివికి దిగి ప్రియలాస్యంతో నా హృదయాన్ని రంజింపవా


http://www.facebook.com/photo.php?fbid=431776550190803&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Tuesday, October 16, 2012

సుందరం.... సుమధురం

Add caption
సుందరం.... సుమధురం

స్థాణువులా ఉన్న నేను ..
నిన్ను చూసి వేణులా పాడాను,,
నన్ను నేను మరచి పసిపాపలా ఆడాను

లోకం సుందరమని విన్నాను..
అందంగా మకరందంలా ఉంటుందని
నిన్ను చూసి తెలుసుకున్నాను,,,

జాబిలికి జాజులు పూచినట్లు
వెన్నెలలో మది విరహంతో వేచినట్లు
జలతారు మాటున దాగినా
నీ మోము వికసించిన కలువలా ఉంది

నీ కంటి చూపు భాణం
గురితప్పక్క సూటిగా నాఎదనే చేరింది
ప్రియా నువ్వెక్కడున్నా ఇదే నీకు నా సందేశం.