Monday, December 31, 2012

శుభాకంక్షలు..

నూతన సంవత్సర శుభాకంక్షలు
జాబిల్లి.. మరుమల్లి

 జాబిల్లి.. మరుమల్లి


దోబూచులాడావే జాబిల్లి
దొంగాటలాడేవే మరుమల్లి
ఈ కోనలోన,అహా,, ఈకూనతోనా అహా
ఈకోనలోన.. ఈకూన తోన
చిరుగాలిలా వచ్చి ఎదగిల్లినావే
ఎన్నెల్లోఎలుగల్లె నన్నల్లుకోవే

కొండల్లో కోనల్లో తిరిగేసీ
ఎండల్లో వానల్లో తడిసేసి
గుండు మల్లెలే తెచ్చేసి
నీ కొప్పులోన తురిమేసి
అందంగ నిన్ను నేచోసుకోనా
గుండెల్లొ పదిలంగా దాచేసుకోనా

దోబూచులాడావే జాబిల్లి
దొంగాటలాడేవే మరుమల్లి

కొండ దేవర ఆనగా...
కోటి కోర్కెలు తీరగా
జతకట్టి మనము ఆడగా
జనమంతా మనఎంట పాడగా,,,


దోబూచులాడావే జాబిల్లి
దొంగాటలాడేవే మరుమల్లి

http://www.facebook.com/photo.php?fbid=462329493802175&set=a.411924015509390.84124.100000753849169&type=1&theaterపాఠక దేవుళ్ళకు ,, విన్నపము,, మీ స్పందనను,svs.vennela@gmail.com తెలియజేయండి
Friday, December 28, 2012

స్నేహ హస్తం..

మీ పరిచయము,, మరియు మీ అభిప్రాయములు తెలియజేయగలరు..
                                                                                                                                                                svs.vennela@gmail.com

ప్రేమారాధనలు


అనురాగ సుథలు చిలుకు అమృత మూర్తికి
ఆ రాధ ప్రేమారాధనలు అపురూపమేకదా...

Tuesday, December 25, 2012

ప్రేమ లేఖ


ప్రియా,,
నిన్ను తలచిన క్షణాన.. ఆ ఊహలతో పరుగెడుతూ
కరిగిపోతున్న కాలాన్ని , కరుణ లేని హృదయాన్ని
పదే పదే నిందిస్తూ,, నీకై వ్రాసిన నా ప్రేమ లేఖ

కాలమా ఆగిపో ఒక్క క్షణం
చెలి నా ముందు నిలిచిన తక్షణం
ఆమె రాకకై నా కన్ను నిరీక్షణం
ఆమె చుట్టూ నా ఊహలు ప్రదక్షణం

నీతో కలసి నడవాలని,, నా ఊసులు నీకు తెలపాలని ఉంది

నా హృదయ స్పందనలో నీ పిలుపు లీలగా వినిపిస్తుంది
నా మానస వీణకు నీవే శృతి, లయవై మౌనరాగమాలపిస్తున్నవు.
సంధ్యకొక రంగులా నీ కన్నుల కాంతులు నన్ను ప్రతిక్షణం స్పృసిస్తున్నాయి
పొద్దుననైనా ,, నిద్దురనైనా నీ రూపే గొచరిస్తుంది

నా చిలుకల కొలికివై రావా,.. రసరమ్య గీతిక ఆలపించగా
నిన్నటి నీ జ్నాపకం నేడు నన్ను నడిపిస్తుంది
రేపటి విజయంకై అహర్నిసలు శ్రమింపజేస్తుంది

నీ కన్నులు చెప్పే భాష నా ప్రేమ కావ్యమయ్యింది
తారకలెన్ని ఉన్నా , ప్రియా నీ చేరికతో నా బ్రతుకు వెన్నెల వెలుగౌతుంది

http://www.facebook.com/photo.php?fbid=459790744056050&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

నువ్వే.. నువ్వే...


నువ్వే నువ్వే..నువ్వే నువ్వే...

నా పెదవులపైన చెరగని నవ్వే
నా మనసున చెరగని చిత్రం నువ్వే
నా హృదయ స్పందన నువ్వే
నా ప్రేమకు ప్రేరణ నువ్వే
నా మాటకు ధారణ నువ్వే
నా పాటకు ప్రాణం నువ్వే
నువ్వే నువ్వే..నువ్వే నువ్వే...

వనములకొచ్చిన వసంతమా
నీ విరహము పంచిన వియోగమా
నా పదముల పలికిన తరంగమా
నీ పదముల నాట్యపు వినోదమా
చిరుగాలి పల్లికీలో చిగురల్లె ఉన్న ప్రేమ
నీ దరికి చేర్చమంటూ కొసరి కొసరి అడిగిందమ్మా

నువ్వే నువ్వే...నువ్వే నువ్వే...

నా వలపులు తెరిచిన వాకిలిలా
నా తలపులు వ్రాసిన కావ్యంలా
నా మమతల పూసిన మల్లియలా
నా ఊహలు మలచిన శిల్పంలా
ఎదకు చేరువైనావు,ఎదుట ఎపుడు నిలిచేవు
వయసు చేసే అల్లరంతా వానలాగా కురిసేను..

నువ్వే నువ్వే...నువ్వే నువ్వే...

fbid=459781177390340&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Monday, December 24, 2012

తొలి ప్రేమ


తొలి ప్రేమ పూవుకు .. తొడిమనైనాను..

మలిప్రేమ కొమ్మకు చిగురునైనాను

మనజంటను కలిపిన కాలమైనాను

మనకై ఎదురు చూసె మాపునైనాను


Friday, December 14, 2012

జోలపాట


లాలి పాటల నిన్ను లాలించనా
జోలపాటలు పాడి జోకొట్టనా

బుడి బుడి నడకలా బుజ్జాయివే
బోసినవ్వుల నిన్ను ముద్దాడనా
కలగన్న రేపును నీలోన చూడనా
ఇలలోన నీకునే జోలలే పాడనా


లాలి పాటల నిన్ను లాలించనా
జోలపాటలు పాడి జోకొట్టనా


జాతిని జాగృతం చేసేటి శక్తివై
ఇలలోన ధర్మాన్ని నెలకొల్పు వ్యక్తివై
పసిడి కాంతులలోడ విలసిల్లు భానుడై
కన్నవారికి నీవు గర్వింప బాలుడై


లాలి పాటల నిన్ను లాలించనా
జోలపాటలు పాడి జోకొట్టనా


గువ్వలు గూటికి చేరేటి వేళ
పువ్వులా మాఇంట నడయాడి రావా
ఆట పాటల తోడ అలసినా నాతండ్రి
ఆదమరచీ నాఒడిన నిదురించరావా..

Thursday, December 6, 2012

వెన్నెలహారతి

    వెన్నెలహారతి                           
                                                             
                                                             
 వేదనతో మరిగి,,                                  
 వెన్నెలగా కరిగి
 విరహంతో విహంగమై
 చెలీ, నీకై విను వీధుల వెతుకుతున్నా

అరుణారుణ సంధ్యలలో                               మధుమాసంలో మంచుపొరలు కప్పేవేళ
గువ్వలుగూటికి చేరేవేళ                               హేమంతములో చేమంతులు పూసే వేళ
నా డెందము సవ్వడి చేసేవేళ                        తొలకరికి పుడమి పులకించే వేళ
సందెపొద్దుకు జాబిలమ్మ                             నా చెలి నెచ్చెలి నీవేల రావేల........
వెన్నెలహారతి పట్టేవేళ
నా చెలీ,, నెచ్చెలి నీవేల రావేల....

Wednesday, December 5, 2012

నీలి మబ్బుల నీటి మడుగులో


నీలి మబ్బుల నీటి మడుగులో
పున్నమి జాబిల్లి పువ్వైనాది
కలల అలలపై సాగే నావకు
కనుపాపే చుక్కాణైనాది..

ఈ వెన్నెల రేయిన,, ఆ చల్లని హాయిన
నా చెలినగుమోమే నువ్వైనట్టుంది
పాల మీగడలాంటి పరువాలొలికించే
పండు వెన్నెలలా తన వలపును కురిపించె

నా వేదనకు ఆవేదనకు  ఊరట నీవే
విరహపు తీరంలో విహంగమై వేచివున్నాను
వినే మనసుంటే, ఓ నేస్తమా,,
ఒక్క క్షణం ఆలకించు
నామది ఆలపిస్తున్న మౌనరాగం,
తన అనురాగమే అనితెల్పు.

Monday, December 31, 2012

శుభాకంక్షలు..

నూతన సంవత్సర శుభాకంక్షలు
జాబిల్లి.. మరుమల్లి

 జాబిల్లి.. మరుమల్లి


దోబూచులాడావే జాబిల్లి
దొంగాటలాడేవే మరుమల్లి
ఈ కోనలోన,అహా,, ఈకూనతోనా అహా
ఈకోనలోన.. ఈకూన తోన
చిరుగాలిలా వచ్చి ఎదగిల్లినావే
ఎన్నెల్లోఎలుగల్లె నన్నల్లుకోవే

కొండల్లో కోనల్లో తిరిగేసీ
ఎండల్లో వానల్లో తడిసేసి
గుండు మల్లెలే తెచ్చేసి
నీ కొప్పులోన తురిమేసి
అందంగ నిన్ను నేచోసుకోనా
గుండెల్లొ పదిలంగా దాచేసుకోనా

దోబూచులాడావే జాబిల్లి
దొంగాటలాడేవే మరుమల్లి

కొండ దేవర ఆనగా...
కోటి కోర్కెలు తీరగా
జతకట్టి మనము ఆడగా
జనమంతా మనఎంట పాడగా,,,


దోబూచులాడావే జాబిల్లి
దొంగాటలాడేవే మరుమల్లి

http://www.facebook.com/photo.php?fbid=462329493802175&set=a.411924015509390.84124.100000753849169&type=1&theaterపాఠక దేవుళ్ళకు ,, విన్నపము,, మీ స్పందనను,svs.vennela@gmail.com తెలియజేయండి
Friday, December 28, 2012

స్నేహ హస్తం..

మీ పరిచయము,, మరియు మీ అభిప్రాయములు తెలియజేయగలరు..
                                                                                                                                                                svs.vennela@gmail.com

ప్రేమారాధనలు


అనురాగ సుథలు చిలుకు అమృత మూర్తికి
ఆ రాధ ప్రేమారాధనలు అపురూపమేకదా...

Tuesday, December 25, 2012

ప్రేమ లేఖ


ప్రియా,,
నిన్ను తలచిన క్షణాన.. ఆ ఊహలతో పరుగెడుతూ
కరిగిపోతున్న కాలాన్ని , కరుణ లేని హృదయాన్ని
పదే పదే నిందిస్తూ,, నీకై వ్రాసిన నా ప్రేమ లేఖ

కాలమా ఆగిపో ఒక్క క్షణం
చెలి నా ముందు నిలిచిన తక్షణం
ఆమె రాకకై నా కన్ను నిరీక్షణం
ఆమె చుట్టూ నా ఊహలు ప్రదక్షణం

నీతో కలసి నడవాలని,, నా ఊసులు నీకు తెలపాలని ఉంది

నా హృదయ స్పందనలో నీ పిలుపు లీలగా వినిపిస్తుంది
నా మానస వీణకు నీవే శృతి, లయవై మౌనరాగమాలపిస్తున్నవు.
సంధ్యకొక రంగులా నీ కన్నుల కాంతులు నన్ను ప్రతిక్షణం స్పృసిస్తున్నాయి
పొద్దుననైనా ,, నిద్దురనైనా నీ రూపే గొచరిస్తుంది

నా చిలుకల కొలికివై రావా,.. రసరమ్య గీతిక ఆలపించగా
నిన్నటి నీ జ్నాపకం నేడు నన్ను నడిపిస్తుంది
రేపటి విజయంకై అహర్నిసలు శ్రమింపజేస్తుంది

నీ కన్నులు చెప్పే భాష నా ప్రేమ కావ్యమయ్యింది
తారకలెన్ని ఉన్నా , ప్రియా నీ చేరికతో నా బ్రతుకు వెన్నెల వెలుగౌతుంది

http://www.facebook.com/photo.php?fbid=459790744056050&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

నువ్వే.. నువ్వే...


నువ్వే నువ్వే..నువ్వే నువ్వే...

నా పెదవులపైన చెరగని నవ్వే
నా మనసున చెరగని చిత్రం నువ్వే
నా హృదయ స్పందన నువ్వే
నా ప్రేమకు ప్రేరణ నువ్వే
నా మాటకు ధారణ నువ్వే
నా పాటకు ప్రాణం నువ్వే
నువ్వే నువ్వే..నువ్వే నువ్వే...

వనములకొచ్చిన వసంతమా
నీ విరహము పంచిన వియోగమా
నా పదముల పలికిన తరంగమా
నీ పదముల నాట్యపు వినోదమా
చిరుగాలి పల్లికీలో చిగురల్లె ఉన్న ప్రేమ
నీ దరికి చేర్చమంటూ కొసరి కొసరి అడిగిందమ్మా

నువ్వే నువ్వే...నువ్వే నువ్వే...

నా వలపులు తెరిచిన వాకిలిలా
నా తలపులు వ్రాసిన కావ్యంలా
నా మమతల పూసిన మల్లియలా
నా ఊహలు మలచిన శిల్పంలా
ఎదకు చేరువైనావు,ఎదుట ఎపుడు నిలిచేవు
వయసు చేసే అల్లరంతా వానలాగా కురిసేను..

నువ్వే నువ్వే...నువ్వే నువ్వే...

fbid=459781177390340&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Monday, December 24, 2012

తొలి ప్రేమ


తొలి ప్రేమ పూవుకు .. తొడిమనైనాను..

మలిప్రేమ కొమ్మకు చిగురునైనాను

మనజంటను కలిపిన కాలమైనాను

మనకై ఎదురు చూసె మాపునైనాను


Friday, December 14, 2012

జోలపాట


లాలి పాటల నిన్ను లాలించనా
జోలపాటలు పాడి జోకొట్టనా

బుడి బుడి నడకలా బుజ్జాయివే
బోసినవ్వుల నిన్ను ముద్దాడనా
కలగన్న రేపును నీలోన చూడనా
ఇలలోన నీకునే జోలలే పాడనా


లాలి పాటల నిన్ను లాలించనా
జోలపాటలు పాడి జోకొట్టనా


జాతిని జాగృతం చేసేటి శక్తివై
ఇలలోన ధర్మాన్ని నెలకొల్పు వ్యక్తివై
పసిడి కాంతులలోడ విలసిల్లు భానుడై
కన్నవారికి నీవు గర్వింప బాలుడై


లాలి పాటల నిన్ను లాలించనా
జోలపాటలు పాడి జోకొట్టనా


గువ్వలు గూటికి చేరేటి వేళ
పువ్వులా మాఇంట నడయాడి రావా
ఆట పాటల తోడ అలసినా నాతండ్రి
ఆదమరచీ నాఒడిన నిదురించరావా..

Thursday, December 6, 2012

వెన్నెలహారతి

    వెన్నెలహారతి                           
                                                             
                                                             
 వేదనతో మరిగి,,                                  
 వెన్నెలగా కరిగి
 విరహంతో విహంగమై
 చెలీ, నీకై విను వీధుల వెతుకుతున్నా

అరుణారుణ సంధ్యలలో                               మధుమాసంలో మంచుపొరలు కప్పేవేళ
గువ్వలుగూటికి చేరేవేళ                               హేమంతములో చేమంతులు పూసే వేళ
నా డెందము సవ్వడి చేసేవేళ                        తొలకరికి పుడమి పులకించే వేళ
సందెపొద్దుకు జాబిలమ్మ                             నా చెలి నెచ్చెలి నీవేల రావేల........
వెన్నెలహారతి పట్టేవేళ
నా చెలీ,, నెచ్చెలి నీవేల రావేల....

Wednesday, December 5, 2012

నీలి మబ్బుల నీటి మడుగులో


నీలి మబ్బుల నీటి మడుగులో
పున్నమి జాబిల్లి పువ్వైనాది
కలల అలలపై సాగే నావకు
కనుపాపే చుక్కాణైనాది..

ఈ వెన్నెల రేయిన,, ఆ చల్లని హాయిన
నా చెలినగుమోమే నువ్వైనట్టుంది
పాల మీగడలాంటి పరువాలొలికించే
పండు వెన్నెలలా తన వలపును కురిపించె

నా వేదనకు ఆవేదనకు  ఊరట నీవే
విరహపు తీరంలో విహంగమై వేచివున్నాను
వినే మనసుంటే, ఓ నేస్తమా,,
ఒక్క క్షణం ఆలకించు
నామది ఆలపిస్తున్న మౌనరాగం,
తన అనురాగమే అనితెల్పు.