Friday, June 21, 2013

నిండు జీవితం

ప్రియా...
మాటలు తడబడుతున్నా... 
మౌనం పొరలు తొలగిస్తే 
మన జీవితంలో కొన్ని నిజాలు వెలుగు చూస్తాయి

అడుగు దూరంలో ఉన్న నిన్ను..

అందుకోలేక పోయాను ఆనాడు..
సముద్రాన్ని లంఘించి, ఆకాశమన్న హద్దులు దాటి 
నిన్ను చేరాలని అర్రులు చాస్తున్నానీనాడు..

కూత వేటులో ఉన్న నీమాట ..

నాకు చేరలేదానాడు..
నీదూరం కాంతి సంవత్సరమైనా ..
స్పందిస్తున్నానీనాడు..

బాల్యంలో చేసుకున్న బాసలు

బాధ్యత తెలియక మరిచానానాడు..
బ్రతుకు దారిలో నీజ్నాపకాలు తరుముతుండగా
నీ బందీనైనానీనాడు..

నీకన్నెతనానికి 

కాపరి ఔదామనుకున్నానాడు..
రూపుకు నోచుకోని మన జ్నాపకాలకు 
కాపరినైనానీనాడు..

పరి పరి ప్రశ్నించే హ్రుదయాన్ని 

సమాధానపరిచాను ఇన్నాళ్ళు..
నీ జవాబుతో జీవితమే 
ఒక ప్రశ్నగా మిగిలిందీనాడు..

తపించే మనసుకు నీఊహసాంత్వన  కూర్చిందిన్నాళ్ళూ..

నిజాన్ని ఊహగా బ్రమించి జీవించాలీడు..
ఊహే జీవితమైతే ,, నా ఊపిరి నీవైతే
నా అడుగులు నీవైపే..

కడలి ఒడిలో సేదతీరాలని 

పరుగు తీసిన జీవనదినేనేను..
గీష్మతాపంతో ఉన్న పుడమిపై
వర్షించ వచ్చిన శ్రావణ మేఘాన్నే నేను.

నీమనసు పూతోటలో గుబాళించిన 
మధుర స్మృతినే నేను..
జీవితం మృదుమధుర తరంగంలా 
సాగుతుందనుకున్నా,, కానీ

వేదనతో ,,సోధనతో  కడలినడు

చుక్కాణికైనా దారితోచని నావగా మారింది..
భారమైన క్షణాలు , నీజ్నాపకాలు
నా మనసుపై స్వారీ చేస్తున్నాయి..

ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే..


కరిగిపోయిన కాలానికి 

జరగనివ్వని విధికి శిక్షేమిటి
విధి బలీయమైనది 
అని సరిపెట్టుకుందామంటే..

జారిపోయింది.. కాలి మువ్వకాదు

ఎగిరిపోయింది.. ఒక గువ్వకాదు..
రాలిపోయింది .. ఒక తొడిమ కాదు
వాడి పోయొంది ..ఒకరోజు పూసిన పువ్వుకాదు..

ఓనిండు జీవితం..
.


నీపట్టు కొమ్మకు పూసిన పూవునే నేను,,

నువ్వు రాయిగ మారి ..నన్ను పరాయిని చేసావు

నీ మనసు మౌనం వీడిన క్షణాన ..

శ్వాస భారంగా మారిన క్షణాన..
కనుల కొలనులు కన్నీటి సంద్రమైన క్షణాన..
నీవు నేను వేరు కాదని తెలిసిందీక్షణాన..

నీమౌనం నా మనసును వేధిస్తున్నది..

అదిఒంటరియై నీకై సోధిస్తున్నది
జీవిత రంగస్థలంపై  
నా మనస వీణ  పలికే తరంగం నువ్వే..


బ్రతుకు చీకటైనా ఊహకు దారి తెలుసు..

జీవితం వెలుగుల పల్లకీ అయినా 
మనసు లేని మనిషి.. 
ఒట్టి మట్టి బొమ్మే కదా..

ఏమిటి ఈ మానసిక దౌర్బల్యం

క్షణమైనా నీ నిరీక్షణ భరించలేనే..
ఆ నాడు పరాయిని చేసావు..
ఈ నాడు బండ రాయిని చేసావు..

నీమనసు నాకు తెలుపలేదు ..

నాకు ఆ అవకాశమే ఇవ్వలేదు
కానీ శిక్ష మాత్రం
ఖరారు చేసావు.

కంట నీరు రాలేదు ,, 

కాని హ్రుదయం కన్నీరు మున్నీరైనది
నాలోని తెంపరితనం 
ఎంత బలహీనమైనదో ఇప్పుడే తెసింది..

నేనైన నీవు 

నాముందు నిలిచి 
ప్రశ్నిస్తునట్లూ ,,
పరిహసిస్తున్నట్లున్నది

చరిత్ర పుటలలో మనలాంటి వాళ్ళెందరో

కాని,, రవళించే మది,, మూగపోతుంది
ఆ విధాత ఖరుకు రాతను ప్రశ్నించలేని నిస్సహాయకులం.
ప్రేమికులం...  
http://www.facebook.com/photo.php?fbid=528840130484444&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

పాఠకులకు విన్నపము.. మీ అభిప్రాయములు  vennelavelugulu.yahoo.com , or svs.vennela@gmail  తెలియజేయండి


Tuesday, June 18, 2013

ప్రియమైన పాఠకులకు విజ్నప్తి..

"వెన్నెల వెలుగులు",,


భావాల పల్లకి,, అనుభూతుల మల్లిక,,రసరమ్య గీతికల అల్లిక,
మన  ఆనందం కోసం మరిన్ని మంచి రచనలు సాగిస్తాను,,
మీరు చూసి మీ మిత్రులకు , బంధువులకు కూడా వెన్నెల వెలుగులను 
పంచండి..


" మీరు నాకిచ్చె బహుమానం" ఇదే..


పదిమంది చదివే అవకాశం మీద్వారా కల్పించండి..
మీ అభిప్రాయలను , సూచనలను ,, సలహాలనున తెలియ పరచిన ,,
ఇంకా మెరుగుపరచి మీముందు మంచి రచనలు
చేయ ప్రయత్నిస్తాను.. మీ అభిప్రాయాలు తెలియపరచవలసిన 
చిరునామా,...., 
svs.vennela@gmail.com,, vennelavelugulu@yahoo.com
మీ .. వెన్నెల వెలుగులు

Thursday, June 13, 2013

ప్రియ బాంధవి

ప్రియ బాంధవి

అక్కరకు రాని వెదురు ముక్కను..నేను...
గాయాల పాలైనా , గేయాలు పలికేను

కానలో కోనలలో, కానరాని దారులలో
కోయిలనై అనురాగగీతమాలపిస్తున్నాను

ఏదారీ కాన రాక, ఎద ఎడారై రోదిస్తుంది
తననే తలుస్తూ మది కన్నెగానే మిగిలింది...

ప్రకృతి సోయగాలు నా చెలికద్దం పట్టాయి
అణువణువూ తన ఉనికేనని ఉడికిస్తున్నాయి..

ఉషోదయంలో తుషారబిందివు తానే...
మలిసంద్యలోని కెంజాయి మెరుపు తానే...

తొలకరి చినుకుల పులకరించిన పుడమి తానె..
ఆ నీలి గగనాన తళుకుతారల జాబిల్లి తానె..
please mail u r feed back to me by svs.vennela@gmail.com

http://www.facebook.com/photo.php?fbid=526342244067566&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Sunday, June 2, 2013

//నేస్తమా.ఆలకించు//



//నేస్తమా.ఆలకించు//

ప్రియా.
నీవు పంచిన మమతను ,,
నింగినై లోకానికి తెలపాలని ఉన్నది..
నీకై ఎదురు చూస్తూ
జీవితపు ఆఖరిఘడియ

వరకైనఉంటానని మది అన్నది.


 మనసులోని భారాన్ని
మరెన్నొనాళ్ళో బంధించి ఉంచలేను
నీకంటూ తెలిపేస్తే
మనసు తేలికాయిపొతుంది కదా..
అద్దమంటి మనసున్న నీకు
ఎలా తెలపాలి నా వలపు...



వసంతంలా వచ్చి
కొమ్మ కొమ్మన చిగురునై తెలుపనా
లేలేత చిగురులు తిన్న
కమ్మని కొయిల పాటై తెలుపనా
ఉషోదయపు వెలుగు రేఖనై
నీహృదయద్వారం ముందు
రంగవల్లికనవ్వనా..
నీకు ఎలా తెలుపాలి...ఈనా వలపును

వరద గోదారల్లే
పరవళ్ళ ఈ పరువాన్ని
ప్రయత్న మాత్రానా ఓపలెకున్నా..
వడి వడిగా పరుగెడుతూ
కడలివైన నీలో కలావలని వున్నది.
 
 
 
రాయబారమన్న పంపుదామంటే.
రాచిలుకే రాదయే
మధురూహలైనా తెలుపుదామంటె
మేఘమాల లేదాయే


 





వనములకు వసంతమొస్తుందంటారే..
ఐతే..నీరాకకు ఎదురుచూసే వనమౌతాను..
నీ వయ్యారి వాలు జడతో
కొట్టేసినా కట్టేసినా నాకిష్టమే
కొంటె చూపుల నీ కళ్ళలో
నను బందీ చెసినా నాకిష్టమె


 ఏజాడ తెలియని
నీ అడుగుజాదలని వెతుకుతూ
ఎదురైన జీవితం లో
ఎండమావుల వెంట పరుగెదుతున్నా
నింగికి నిచ్చెన వెస్తూ...
నీ చెయ్యి అందుకొవాలని ప్రయత్నిస్తున్నా....
..


గ్నాపకాల పుటలలొ
నీ నీడలు లీలగా అగుపిస్తున్నాయి
నా చెంతన లెకున్నా .
.మనసు నీ చింతన వీడనంది
     
         
కొవ్వొత్తి కాంతినై
నీ వూహకు దారి చూపుతూ ..
వూపిరి వున్నంత వరకు
వెలుగవ్వాలని వుంది
    

సుతి మెత్తని నీ పాదనికి
సిరిమువ్వ అవ్వాలని వుంది
సిగ్గులొలుకు నీ చెక్కిలి పై
చుక్కనవ్వాలని వుంది******
నీ అధరముపై వసి వాడని
చిరునవ్వై వొదగాలని వుంది



మెత్తని నీ హృదయంలో
సుతి మెత్తని నీ గ్నాపకాలను
ఒక్కసారి పరికించి చూడు..
రేణువైన నేను వేణువునై
నీ అనురాగ గీతమాపిస్తున్నాను
















 


మనసుతొ ఆలకించు...చెలిమితొ పలకరించు...
వెన్నెల వెలుగై నా మదిలొ కలువలు పూయించు
















ప్రియమైన పాఠక దేవుళ్ళకు svs.vennela@gmail.com.. మీ స్పందనను,, తెలియజేయండి..స్పందించిన ప్రతి మనసుకు వందనము.. మీ ప్రోత్సాహమే.. మాకుప్రేరణ కలిగిస్తుంది..మీ అభిప్రాయములు , సలహాలు , సూచనలు తెలియజేయండి... 

Friday, June 21, 2013

నిండు జీవితం

ప్రియా...
మాటలు తడబడుతున్నా... 
మౌనం పొరలు తొలగిస్తే 
మన జీవితంలో కొన్ని నిజాలు వెలుగు చూస్తాయి

అడుగు దూరంలో ఉన్న నిన్ను..

అందుకోలేక పోయాను ఆనాడు..
సముద్రాన్ని లంఘించి, ఆకాశమన్న హద్దులు దాటి 
నిన్ను చేరాలని అర్రులు చాస్తున్నానీనాడు..

కూత వేటులో ఉన్న నీమాట ..

నాకు చేరలేదానాడు..
నీదూరం కాంతి సంవత్సరమైనా ..
స్పందిస్తున్నానీనాడు..

బాల్యంలో చేసుకున్న బాసలు

బాధ్యత తెలియక మరిచానానాడు..
బ్రతుకు దారిలో నీజ్నాపకాలు తరుముతుండగా
నీ బందీనైనానీనాడు..

నీకన్నెతనానికి 

కాపరి ఔదామనుకున్నానాడు..
రూపుకు నోచుకోని మన జ్నాపకాలకు 
కాపరినైనానీనాడు..

పరి పరి ప్రశ్నించే హ్రుదయాన్ని 

సమాధానపరిచాను ఇన్నాళ్ళు..
నీ జవాబుతో జీవితమే 
ఒక ప్రశ్నగా మిగిలిందీనాడు..

తపించే మనసుకు నీఊహసాంత్వన  కూర్చిందిన్నాళ్ళూ..

నిజాన్ని ఊహగా బ్రమించి జీవించాలీడు..
ఊహే జీవితమైతే ,, నా ఊపిరి నీవైతే
నా అడుగులు నీవైపే..

కడలి ఒడిలో సేదతీరాలని 

పరుగు తీసిన జీవనదినేనేను..
గీష్మతాపంతో ఉన్న పుడమిపై
వర్షించ వచ్చిన శ్రావణ మేఘాన్నే నేను.

నీమనసు పూతోటలో గుబాళించిన 
మధుర స్మృతినే నేను..
జీవితం మృదుమధుర తరంగంలా 
సాగుతుందనుకున్నా,, కానీ

వేదనతో ,,సోధనతో  కడలినడు

చుక్కాణికైనా దారితోచని నావగా మారింది..
భారమైన క్షణాలు , నీజ్నాపకాలు
నా మనసుపై స్వారీ చేస్తున్నాయి..

ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే..


కరిగిపోయిన కాలానికి 

జరగనివ్వని విధికి శిక్షేమిటి
విధి బలీయమైనది 
అని సరిపెట్టుకుందామంటే..

జారిపోయింది.. కాలి మువ్వకాదు

ఎగిరిపోయింది.. ఒక గువ్వకాదు..
రాలిపోయింది .. ఒక తొడిమ కాదు
వాడి పోయొంది ..ఒకరోజు పూసిన పువ్వుకాదు..

ఓనిండు జీవితం..
.


నీపట్టు కొమ్మకు పూసిన పూవునే నేను,,

నువ్వు రాయిగ మారి ..నన్ను పరాయిని చేసావు

నీ మనసు మౌనం వీడిన క్షణాన ..

శ్వాస భారంగా మారిన క్షణాన..
కనుల కొలనులు కన్నీటి సంద్రమైన క్షణాన..
నీవు నేను వేరు కాదని తెలిసిందీక్షణాన..

నీమౌనం నా మనసును వేధిస్తున్నది..

అదిఒంటరియై నీకై సోధిస్తున్నది
జీవిత రంగస్థలంపై  
నా మనస వీణ  పలికే తరంగం నువ్వే..


బ్రతుకు చీకటైనా ఊహకు దారి తెలుసు..

జీవితం వెలుగుల పల్లకీ అయినా 
మనసు లేని మనిషి.. 
ఒట్టి మట్టి బొమ్మే కదా..

ఏమిటి ఈ మానసిక దౌర్బల్యం

క్షణమైనా నీ నిరీక్షణ భరించలేనే..
ఆ నాడు పరాయిని చేసావు..
ఈ నాడు బండ రాయిని చేసావు..

నీమనసు నాకు తెలుపలేదు ..

నాకు ఆ అవకాశమే ఇవ్వలేదు
కానీ శిక్ష మాత్రం
ఖరారు చేసావు.

కంట నీరు రాలేదు ,, 

కాని హ్రుదయం కన్నీరు మున్నీరైనది
నాలోని తెంపరితనం 
ఎంత బలహీనమైనదో ఇప్పుడే తెసింది..

నేనైన నీవు 

నాముందు నిలిచి 
ప్రశ్నిస్తునట్లూ ,,
పరిహసిస్తున్నట్లున్నది

చరిత్ర పుటలలో మనలాంటి వాళ్ళెందరో

కాని,, రవళించే మది,, మూగపోతుంది
ఆ విధాత ఖరుకు రాతను ప్రశ్నించలేని నిస్సహాయకులం.
ప్రేమికులం...  
http://www.facebook.com/photo.php?fbid=528840130484444&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

పాఠకులకు విన్నపము.. మీ అభిప్రాయములు  vennelavelugulu.yahoo.com , or svs.vennela@gmail  తెలియజేయండి


Tuesday, June 18, 2013

ప్రియమైన పాఠకులకు విజ్నప్తి..

"వెన్నెల వెలుగులు",,


భావాల పల్లకి,, అనుభూతుల మల్లిక,,రసరమ్య గీతికల అల్లిక,
మన  ఆనందం కోసం మరిన్ని మంచి రచనలు సాగిస్తాను,,
మీరు చూసి మీ మిత్రులకు , బంధువులకు కూడా వెన్నెల వెలుగులను 
పంచండి..


" మీరు నాకిచ్చె బహుమానం" ఇదే..


పదిమంది చదివే అవకాశం మీద్వారా కల్పించండి..
మీ అభిప్రాయలను , సూచనలను ,, సలహాలనున తెలియ పరచిన ,,
ఇంకా మెరుగుపరచి మీముందు మంచి రచనలు
చేయ ప్రయత్నిస్తాను.. మీ అభిప్రాయాలు తెలియపరచవలసిన 
చిరునామా,...., 
svs.vennela@gmail.com,, vennelavelugulu@yahoo.com
మీ .. వెన్నెల వెలుగులు

Thursday, June 13, 2013

ప్రియ బాంధవి

ప్రియ బాంధవి

అక్కరకు రాని వెదురు ముక్కను..నేను...
గాయాల పాలైనా , గేయాలు పలికేను

కానలో కోనలలో, కానరాని దారులలో
కోయిలనై అనురాగగీతమాలపిస్తున్నాను

ఏదారీ కాన రాక, ఎద ఎడారై రోదిస్తుంది
తననే తలుస్తూ మది కన్నెగానే మిగిలింది...

ప్రకృతి సోయగాలు నా చెలికద్దం పట్టాయి
అణువణువూ తన ఉనికేనని ఉడికిస్తున్నాయి..

ఉషోదయంలో తుషారబిందివు తానే...
మలిసంద్యలోని కెంజాయి మెరుపు తానే...

తొలకరి చినుకుల పులకరించిన పుడమి తానె..
ఆ నీలి గగనాన తళుకుతారల జాబిల్లి తానె..
please mail u r feed back to me by svs.vennela@gmail.com

http://www.facebook.com/photo.php?fbid=526342244067566&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Sunday, June 2, 2013

//నేస్తమా.ఆలకించు//



//నేస్తమా.ఆలకించు//

ప్రియా.
నీవు పంచిన మమతను ,,
నింగినై లోకానికి తెలపాలని ఉన్నది..
నీకై ఎదురు చూస్తూ
జీవితపు ఆఖరిఘడియ

వరకైనఉంటానని మది అన్నది.


 మనసులోని భారాన్ని
మరెన్నొనాళ్ళో బంధించి ఉంచలేను
నీకంటూ తెలిపేస్తే
మనసు తేలికాయిపొతుంది కదా..
అద్దమంటి మనసున్న నీకు
ఎలా తెలపాలి నా వలపు...



వసంతంలా వచ్చి
కొమ్మ కొమ్మన చిగురునై తెలుపనా
లేలేత చిగురులు తిన్న
కమ్మని కొయిల పాటై తెలుపనా
ఉషోదయపు వెలుగు రేఖనై
నీహృదయద్వారం ముందు
రంగవల్లికనవ్వనా..
నీకు ఎలా తెలుపాలి...ఈనా వలపును

వరద గోదారల్లే
పరవళ్ళ ఈ పరువాన్ని
ప్రయత్న మాత్రానా ఓపలెకున్నా..
వడి వడిగా పరుగెడుతూ
కడలివైన నీలో కలావలని వున్నది.
 
 
 
రాయబారమన్న పంపుదామంటే.
రాచిలుకే రాదయే
మధురూహలైనా తెలుపుదామంటె
మేఘమాల లేదాయే


 





వనములకు వసంతమొస్తుందంటారే..
ఐతే..నీరాకకు ఎదురుచూసే వనమౌతాను..
నీ వయ్యారి వాలు జడతో
కొట్టేసినా కట్టేసినా నాకిష్టమే
కొంటె చూపుల నీ కళ్ళలో
నను బందీ చెసినా నాకిష్టమె


 ఏజాడ తెలియని
నీ అడుగుజాదలని వెతుకుతూ
ఎదురైన జీవితం లో
ఎండమావుల వెంట పరుగెదుతున్నా
నింగికి నిచ్చెన వెస్తూ...
నీ చెయ్యి అందుకొవాలని ప్రయత్నిస్తున్నా....
..


గ్నాపకాల పుటలలొ
నీ నీడలు లీలగా అగుపిస్తున్నాయి
నా చెంతన లెకున్నా .
.మనసు నీ చింతన వీడనంది
     
         
కొవ్వొత్తి కాంతినై
నీ వూహకు దారి చూపుతూ ..
వూపిరి వున్నంత వరకు
వెలుగవ్వాలని వుంది
    

సుతి మెత్తని నీ పాదనికి
సిరిమువ్వ అవ్వాలని వుంది
సిగ్గులొలుకు నీ చెక్కిలి పై
చుక్కనవ్వాలని వుంది******
నీ అధరముపై వసి వాడని
చిరునవ్వై వొదగాలని వుంది



మెత్తని నీ హృదయంలో
సుతి మెత్తని నీ గ్నాపకాలను
ఒక్కసారి పరికించి చూడు..
రేణువైన నేను వేణువునై
నీ అనురాగ గీతమాపిస్తున్నాను
















 


మనసుతొ ఆలకించు...చెలిమితొ పలకరించు...
వెన్నెల వెలుగై నా మదిలొ కలువలు పూయించు
















ప్రియమైన పాఠక దేవుళ్ళకు svs.vennela@gmail.com.. మీ స్పందనను,, తెలియజేయండి..స్పందించిన ప్రతి మనసుకు వందనము.. మీ ప్రోత్సాహమే.. మాకుప్రేరణ కలిగిస్తుంది..మీ అభిప్రాయములు , సలహాలు , సూచనలు తెలియజేయండి...