Wednesday, January 30, 2013

నా ఆరాటం.. ఈ పోరాటాం

 నా ఆరాటం..  ఈ పోరాటాం

నీతో గడిపిన క్షణాల ఇటుకలు పేర్చి
జ్నాపకాల భవంతిని నిర్మించాను
అనాదిగా ఉన్న మనపరిచయాన్ని పునాదిగా మార్చాను

పసిమనసున మొదలై,పరువంతొ వరదై
పరుగెట్టె మనసుకు కళ్ళెం వెయలేక అవస్తపడుతున్నాను
కాలంతోపాటు కొత్తాందాలు సంతరించుకొన్న ప్రకృతి సాక్షిగా
వగరు చిగురులు,తిని , సొగసుగా పాడే ఆ కోయిల సాక్షిగా

ఋతువు ఋతువుకు మెరుపుదిద్దిన, పుడమి పాదాల సాక్షిగా
చినుకుగా కురిసి, సెలయెరుగా నడచి , నదులుగా పరుగెట్టి
సముద్రుని చేరాలనె ఆ జలధార ఆరాటం సాక్షిగా

చుగురై మొలిచి, ఆకై నిలిచి, లతగాపెనవేసుకొని,
 తుమ్మెదతో రమించి, పుష్పించి,ఫలించి
ఒక జీవికి ఆహారమైన ఆయువు సాక్షిగా
నిర్వేదం దరిచేరక,స్వేదంచిందగా, పుడమిని చీల్చుకొని మొలకెత్తిన పత్తినినేనై
వత్తిగా మారి, ఆ పరమాత్మునికి దివ్వెనైన వెలుగు సాక్షిగా

మన స్నేహంతో పుట్టిన నేస్తం అనే రూపం సాక్షిగా మన
జ్నాపకాల సౌధాన్ని ఎన్నటికి పదిల పరచాలని
ఈ నా ఆరాటం.. అందుకే ఈ పోరాటాం

http://www.facebook.com/photo.php?fbid=474284659273325&set=o.128737950625392&type=1&theater
పాఠక దేవుళ్ళకు విన్నపము.. మీ స్పందనను  svs.vennela@mail.com  తెలియజేయండి.

Thursday, January 24, 2013

థరణి నేను ..థరణిని నేనే..

పాఠక దేవుళ్ళకు ,, విన్నపము,, మీ స్పందనను,svs.vennela@gmail.com తెలియజేయండి

Tuesday, January 22, 2013

ఐకమత్యము

ఐకమత్యము (22.1.2013..svs)

కదలి రండి కదలి రండి
కలసి మెలసి జీవిద్దాం

రాజు పేద బేధమొద్దు
కులమతాల హద్దులొద్దు
మానవత్వమే మనమతమని
అదియే మనకు సమ్మతమని...

రాచరికపు జీవితాలు రాళ్ళపాలు కాలేదా..
ఓడలు బండ్లైనట్లు చరిత మనకు తెలుపలేదా
పెత్తందారుల రాజ్యం పెకలించుపోలేదా
చలి చీమల చేతచిక్కి పెనుబామే చావలేదా..

గడ్డిపరక తాటితోన గజమును బంధించలేదా
ఐదువేళ్ళు అదిమిపెడితే ఉక్కుపిడికిలిగా మారలేదా
పెద్దలు చెప్పిన మాటను పెడచెవిన పెట్టబోకు
బ్రతుకు విలువ తెలుసుకోక ముళ్ళబాటన నడవబోకు..

http://www.facebook.com/photo.php?fbid=471274619574329&set=o.128737950625392&type=1&theater

Friday, January 11, 2013

సంక్రాంతి శుభాకాంక్షలు...

ప్రియ మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు...

Monday, January 7, 2013

మబ్బుల పొదరింట

దోబూచులాడెటి జాబిల్లి

ప్రేమికుల మదిలో మరులు గొల్పు మరుమల్లి
పాల మీగడల మేఘాల పొత్తిళ్ళలో
పసిపాపలా పరుగిడు ఓ జాబిలమ్మా
నింగిన నిను చూసి నేలపై రోజాలు చిన్నబోయాయమ్మ
మన్మధుడి తోబుట్టువై ,, ప్రేమకులకు ప్రేరణవై
నీలాకాసంలో మణిదీపమైన నీ సొగసు చూసి
లోకం నివ్వెరపోతున్నది

Friday, January 4, 2013

ప్రేమ.. సాక్షిగా,,

  ప్రేమ..సాక్షిగా,,

భూమి ఆకాశాల సాక్షిగా,,
సూర్య చంద్రుల సాక్షిగా
ఉదయానికి అస్తమయానికి
వారధిగా నిలిచిన
తొలి మలి సంధ్యల సాక్షిగా
నా మనసు నీకై పడే ఆరాటం సాక్షిగా
నీ ఎడబాటనే ప్రేమ(మంట) సాక్షిగా
నేనే నీవైన నా ఆత్మసాక్షిగా

ఎప్పటికీ నీకై వేచివుంటాను,, ప్రియా...
5.1.2013.(1.43 a.m)

http://www.facebook.com/photo.php?fbid=464116863623438&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Thursday, January 3, 2013

ఓంగోలు రైల్వే స్టేషన్

ఓంగోలు పట్టణానికి
వన్నెలద్దిన ముఖచిత్రం

ఓంగోలుకు ద్వారమైన ,,
మణిహారమైన రైల్వే స్టేషన్

 ముఖ చిత్రం..1.1.2013..

Tuesday, January 1, 2013

నేనే నీవైనాను...

నీచూపుకై ఎదురు చూసే వేకువనైనాను
నీ పిలుపుకై వేచే వసంతమైనాను
నీ ఊహల పరుగులతో అలుపెరగకున్నాను
నేనే నీవైన   నా నీడను చూస్తున్నాను

fbid=462779847090473&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater