నా ఆరాటం.. ఈ పోరాటాం
నీతో గడిపిన క్షణాల ఇటుకలు పేర్చి
జ్నాపకాల భవంతిని నిర్మించాను
అనాదిగా ఉన్న మనపరిచయాన్ని పునాదిగా మార్చాను
పసిమనసున మొదలై,పరువంతొ వరదై
పరుగెట్టె మనసుకు కళ్ళెం వెయలేక అవస్తపడుతున్నాను
కాలంతోపాటు కొత్తాందాలు సంతరించుకొన్న ప్రకృతి సాక్షిగా
వగరు చిగురులు,తిని , సొగసుగా పాడే ఆ కోయిల సాక్షిగా
ఋతువు ఋతువుకు మెరుపుదిద్దిన, పుడమి పాదాల సాక్షిగా
చినుకుగా కురిసి, సెలయెరుగా నడచి , నదులుగా పరుగెట్టి
సముద్రుని చేరాలనె ఆ జలధార ఆరాటం సాక్షిగా
చుగురై మొలిచి, ఆకై నిలిచి, లతగాపెనవేసుకొని,
తుమ్మెదతో రమించి, పుష్పించి,ఫలించి
ఒక జీవికి ఆహారమైన ఆయువు సాక్షిగా
నిర్వేదం దరిచేరక,స్వేదంచిందగా, పుడమిని చీల్చుకొని మొలకెత్తిన పత్తినినేనై
వత్తిగా మారి, ఆ పరమాత్మునికి దివ్వెనైన వెలుగు సాక్షిగా
మన స్నేహంతో పుట్టిన నేస్తం అనే రూపం సాక్షిగా మన
జ్నాపకాల సౌధాన్ని ఎన్నటికి పదిల పరచాలని
ఈ నా ఆరాటం.. అందుకే ఈ పోరాటాం
http://www.facebook.com/photo.php?fbid=474284659273325&set=o.128737950625392&type=1&theater
పాఠక దేవుళ్ళకు విన్నపము.. మీ స్పందనను svs.vennela@mail.com తెలియజేయండి.
Prakatanalo unnadi. AARAATAM
ReplyDeletePareekshinchukovadam lo ledu. PORAATAM
నిరీక్షించె మనసు ,, ప్రేయసికై, ఎన్ని యుగాలైనా వేచి ఉంటుందంటారుకదా,, అలాగే ,, ఆమెతో గడిపిన క్షణాలను ఇటుకలుగా పేర్చి ,, ఆ అనుభవాలను భవంథిగా నిర్మించాలని భావన,,,
ReplyDelete