Tuesday, January 22, 2013

ఐకమత్యము

ఐకమత్యము (22.1.2013..svs)
కదలి రండి కదలి రండి
కలసి మెలసి జీవిద్దాం

రాజు పేద బేధమొద్దు
కులమతాల హద్దులొద్దు
మానవత్వమే మనమతమని
అదియే మనకు సమ్మతమని...

రాచరికపు జీవితాలు రాళ్ళపాలు కాలేదా..
ఓడలు బండ్లైనట్లు చరిత మనకు తెలుపలేదా
పెత్తందారుల రాజ్యం పెకలించుపోలేదా
చలి చీమల చేతచిక్కి పెనుబామే చావలేదా..

గడ్డిపరక తాటితోన గజమును బంధించలేదా
ఐదువేళ్ళు అదిమిపెడితే ఉక్కుపిడికిలిగా మారలేదా
పెద్దలు చెప్పిన మాటను పెడచెవిన పెట్టబోకు
బ్రతుకు విలువ తెలుసుకోక ముళ్ళబాటన నడవబోకు..

http://www.facebook.com/photo.php?fbid=471274619574329&set=o.128737950625392&type=1&theater