Thursday, July 11, 2013

జీవుడే,...దేవుడు

.జీవుడే,...దేవుడు

జీవునిలోనే దేవుని చూడరా..
దేవుని జీవుని బేధములేదురా..
మానవ సేవే మాధవసేవకు
మార్గంమ్మనెడి మర్మమునెరుగరా..


వేషములెన్నో వేసి , మోసములెన్నో చేసి
పొట్టకట్టుకొని మూటకట్టినా 
పట్టుకెళ్ళునది ఏమిలేదురా..
జ్నానము తెలిసి జీవించు,, జనులకు మార్గము చూపించు

ఎండకు ఎండి వానకు తడిసినా 
స్వార్ధము ఎరుగని మొక్కను చూడరా..
నీడను ఇచ్చి పండ్లను పంచి 
కలిమిని కూర్చే కల్పతరువురా..
మానవ జన్మకు అర్ధమునెరిగి 
మంచిని పెంచి ప్రేమను పంచరా..

జీవునిలోనే దేవుని చూడరా..
దేవుని జీవుని బేధములేదురా..Thursday, July 11, 2013

జీవుడే,...దేవుడు

.జీవుడే,...దేవుడు

జీవునిలోనే దేవుని చూడరా..
దేవుని జీవుని బేధములేదురా..
మానవ సేవే మాధవసేవకు
మార్గంమ్మనెడి మర్మమునెరుగరా..


వేషములెన్నో వేసి , మోసములెన్నో చేసి
పొట్టకట్టుకొని మూటకట్టినా 
పట్టుకెళ్ళునది ఏమిలేదురా..
జ్నానము తెలిసి జీవించు,, జనులకు మార్గము చూపించు

ఎండకు ఎండి వానకు తడిసినా 
స్వార్ధము ఎరుగని మొక్కను చూడరా..
నీడను ఇచ్చి పండ్లను పంచి 
కలిమిని కూర్చే కల్పతరువురా..
మానవ జన్మకు అర్ధమునెరిగి 
మంచిని పెంచి ప్రేమను పంచరా..

జీవునిలోనే దేవుని చూడరా..
దేవుని జీవుని బేధములేదురా..