కన్నెమనసు..
...........
కాముడితో కబురెట్టనా..
మెఘునితో మొరపెట్టనా..
వయసు చెసే అల్లరంతా..
ఓపలేని మేనంతా ..
ఏదో తెలుయని పులకింత..
సాయం చెయరావా ప్రియా
ఈ సాయంకాలం వేళ కూసంత,,,
వేసంగి మల్లెలు వేచి ఉన్నాయి
చెలికాని రాకకు స్వాగతిద్దమని
చిలుక రాయబారమైన పంపేనా
చిగుళ్ళు తొడిగిన నా ప్రేమను
నీకు వివరించుటకు.
ముంగురుల సవరించే
చిరుగాలితొ చెప్పనా,,
వెన్నెల రాతిరి,
ఈ కన్నియ మనసును ఏలెదొరనీవేనని...
అందమైన పదాలతో మరింత అందమైన బొమ్మలతో మీ బ్లాగు చక్కగా అలంకరించారు.
ReplyDelete