Friday, October 19, 2012

సరదాల దసరా.


సరదాల దసరా.

సరదాల పండుగ
మన దసరా పండుగ..
కానీ ఏ పరదాలమాటున దాగెనో
ఆ సరదాలు..

అలనాటి పద్యాలు
అర్ధాలు మార్చాయి
అన్నివర్గాల జనులు
మన సంస్కృతిన మరచిన ఘనులు

అయ్యవారికి చాలు ఐదు వరహాలు..
పిల్ల వాళ్ళకు చాలు పప్పుబెల్లాలు
ఆనాటి మాట..

సీటుకొక రేటు సామాన్యుడిపై వేటు
పిల్లలకైతే బుక్స్ తో ఫైటు..
ఈనాటి మాట

పల్లెసీమలు , పట్టు కొమ్మలు
పట్టు పావడాల ముద్దుగుమ్మలు
ముద్దులొలికె పసి పాపలు..
పసిడి కాంతుల పచ్చపైరులు
ఆనాటి పల్లె సీమలు..

వర్గవైషమ్యాలు, కులాల కుశ్చితాలు
భూమి తగాదాలు రచ్చబండ రాజకీయాలు
నేటి పల్లెసీమలు

వీధి భాగవతాలు, బుర్రకథలు
తోలుబొమ్మలాటలు ఎంకి పాటలు
అనాటి సరదాలు.

పబ్బులు క్లబ్బులు
కుర్రకారుకు జబ్బులు
మితిమీరిన నాగరికత
పాశ్చాత్య ఫ్యాషన్ షోలు
నేటి సరదాలు...

యువతకు భవితనిచ్చిన నాడు,,
సమత మమతతో సహజీవనం చేసిననాడు
మతమౌఢ్యం నశించిన నాడు
మానవత్వం మనగలిగిన నాడు..
ఆనాడే సరదా,, ఆనాడే నిజమైన దసరా..
....వెన్నెల వెలుగులు,

http://www.facebook.com/photo.php?fbid=435435479824910&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

No comments:

Post a Comment

Friday, October 19, 2012

సరదాల దసరా.


సరదాల దసరా.

సరదాల పండుగ
మన దసరా పండుగ..
కానీ ఏ పరదాలమాటున దాగెనో
ఆ సరదాలు..

అలనాటి పద్యాలు
అర్ధాలు మార్చాయి
అన్నివర్గాల జనులు
మన సంస్కృతిన మరచిన ఘనులు

అయ్యవారికి చాలు ఐదు వరహాలు..
పిల్ల వాళ్ళకు చాలు పప్పుబెల్లాలు
ఆనాటి మాట..

సీటుకొక రేటు సామాన్యుడిపై వేటు
పిల్లలకైతే బుక్స్ తో ఫైటు..
ఈనాటి మాట

పల్లెసీమలు , పట్టు కొమ్మలు
పట్టు పావడాల ముద్దుగుమ్మలు
ముద్దులొలికె పసి పాపలు..
పసిడి కాంతుల పచ్చపైరులు
ఆనాటి పల్లె సీమలు..

వర్గవైషమ్యాలు, కులాల కుశ్చితాలు
భూమి తగాదాలు రచ్చబండ రాజకీయాలు
నేటి పల్లెసీమలు

వీధి భాగవతాలు, బుర్రకథలు
తోలుబొమ్మలాటలు ఎంకి పాటలు
అనాటి సరదాలు.

పబ్బులు క్లబ్బులు
కుర్రకారుకు జబ్బులు
మితిమీరిన నాగరికత
పాశ్చాత్య ఫ్యాషన్ షోలు
నేటి సరదాలు...

యువతకు భవితనిచ్చిన నాడు,,
సమత మమతతో సహజీవనం చేసిననాడు
మతమౌఢ్యం నశించిన నాడు
మానవత్వం మనగలిగిన నాడు..
ఆనాడే సరదా,, ఆనాడే నిజమైన దసరా..
....వెన్నెల వెలుగులు,

http://www.facebook.com/photo.php?fbid=435435479824910&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

No comments:

Post a Comment