నువ్వే నువ్వే..నువ్వే నువ్వే...
నా పెదవులపైన చెరగని నవ్వే
నా మనసున చెరగని చిత్రం నువ్వే
నా హృదయ స్పందన నువ్వే
నా ప్రేమకు ప్రేరణ నువ్వే
నా మాటకు ధారణ నువ్వే
నా పాటకు ప్రాణం నువ్వే
నువ్వే నువ్వే..నువ్వే నువ్వే...
వనములకొచ్చిన వసంతమా
నీ విరహము పంచిన వియోగమా
నా పదముల పలికిన తరంగమా
నీ పదముల నాట్యపు వినోదమా
చిరుగాలి పల్లికీలో చిగురల్లె ఉన్న ప్రేమ
నీ దరికి చేర్చమంటూ కొసరి కొసరి అడిగిందమ్మా
నువ్వే నువ్వే...నువ్వే నువ్వే...
నా వలపులు తెరిచిన వాకిలిలా
నా తలపులు వ్రాసిన కావ్యంలా
నా మమతల పూసిన మల్లియలా
నా ఊహలు మలచిన శిల్పంలా
ఎదకు చేరువైనావు,ఎదుట ఎపుడు నిలిచేవు
వయసు చేసే అల్లరంతా వానలాగా కురిసేను..
నువ్వే నువ్వే...నువ్వే నువ్వే...
fbid=459781177390340&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

No comments:
Post a Comment