//నేస్తమా.ఆలకించు//
ప్రియా.
నీవు పంచిన మమతను ,,
నింగినై లోకానికి తెలపాలని ఉన్నది..
నీకై ఎదురు చూస్తూ
జీవితపు ఆఖరిఘడియ
వరకైనఉంటానని మది అన్నది.
మనసులోని భారాన్ని
మరెన్నొనాళ్ళో బంధించి ఉంచలేను
నీకంటూ తెలిపేస్తే
మనసు తేలికాయిపొతుంది కదా..
అద్దమంటి మనసున్న నీకు
ఎలా తెలపాలి నా వలపు...
వసంతంలా వచ్చి
కొమ్మ కొమ్మన చిగురునై తెలుపనా
లేలేత చిగురులు తిన్న
కమ్మని కొయిల పాటై తెలుపనా
ఉషోదయపు వెలుగు రేఖనై
నీహృదయద్వారం ముందు
రంగవల్లికనవ్వనా..
నీకు ఎలా తెలుపాలి...ఈనా వలపును
వరద గోదారల్లే
పరవళ్ళ ఈ పరువాన్ని
ప్రయత్న మాత్రానా ఓపలెకున్నా..
వడి వడిగా పరుగెడుతూ
కడలివైన నీలో కలావలని వున్నది.
రాయబారమన్న పంపుదామంటే.
రాచిలుకే రాదయే
మధురూహలైనా తెలుపుదామంటె
మేఘమాల లేదాయే
రాచిలుకే రాదయే
మధురూహలైనా తెలుపుదామంటె
మేఘమాల లేదాయే
ఐతే..నీరాకకు ఎదురుచూసే వనమౌతాను..
నీ వయ్యారి వాలు జడతో
కొట్టేసినా కట్టేసినా నాకిష్టమే
కొంటె చూపుల నీ కళ్ళలో
నను బందీ చెసినా నాకిష్టమె
ఏజాడ తెలియని
నీ అడుగుజాదలని వెతుకుతూ
ఎదురైన జీవితం లో
ఎండమావుల వెంట పరుగెదుతున్నా
నింగికి నిచ్చెన వెస్తూ...
నీ చెయ్యి అందుకొవాలని ప్రయత్నిస్తున్నా......
గ్నాపకాల పుటలలొ
నీ నీడలు లీలగా అగుపిస్తున్నాయి
నా చెంతన లెకున్నా ..మనసు నీ చింతన వీడనంది
కొవ్వొత్తి కాంతినై
నీ వూహకు దారి చూపుతూ ..
వూపిరి వున్నంత వరకు
వెలుగవ్వాలని వుంది
సుతి మెత్తని నీ పాదనికి
సిరిమువ్వ అవ్వాలని వుంది
సిగ్గులొలుకు నీ చెక్కిలి పై
చుక్కనవ్వాలని వుంది******
నీ అధరముపై వసి వాడని
చిరునవ్వై వొదగాలని వుంది
మెత్తని నీ హృదయంలో
సుతి మెత్తని నీ గ్నాపకాలను
ఒక్కసారి పరికించి చూడు..
రేణువైన నేను వేణువునై
నీ అనురాగ గీతమాపిస్తున్నాను
మనసుతొ ఆలకించు...చెలిమితొ పలకరించు...
వెన్నెల వెలుగై నా మదిలొ కలువలు పూయించు
ప్రియమైన పాఠక దేవుళ్ళకు svs.vennela@gmail.com.. మీ స్పందనను,, తెలియజేయండి..స్పందించిన ప్రతి మనసుకు వందనము.. మీ ప్రోత్సాహమే.. మాకుప్రేరణ కలిగిస్తుంది..మీ అభిప్రాయములు , సలహాలు , సూచనలు తెలియజేయండి...
No comments:
Post a Comment